సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్ఐ పర్వతాలు

77చూసినవారు
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్ఐ పర్వతాలు
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల రూరల్ ఎస్ఐ పర్వతాలు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైనట్లు తెలిస్తే 1930కు కాల్ చేయాలన్నారు. ఎవరికి ఓటీపీ చెప్పరాదని, మొబైల్ లో బ్లూ కలర్ లింక్స్ క్లిక్ చేయరాదని, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్, పిన్ నెంబర్లు చెప్పరాదని ఎస్ఐ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్