పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్ఐ స్వాతి

65చూసినవారు
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్ఐ స్వాతి
జోగులాంబ గద్వాల జిల్లా కోదండ పూర్ పోలీస్ పీఎస్ లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చెన్నకేశవులు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్పీ రితిరాజ్ ఆదేశాల మేరకు కోదండపూర్ ఎస్ఐ స్వాతి శనివారం ఆయన స్వగ్రామం లింగన్వాయికి వెళ్లి భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మట్టి ఖర్చులకు రూ. 20, 000 ఆర్థిక సహాయం చేశారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్