ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న జడ్పీ ఛైర్ పర్సన్

57చూసినవారు
ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న జడ్పీ ఛైర్ పర్సన్
గద్వాల మండలంలోని గోనుపాడు గ్రామంలోని రంజాన్ సందర్భంగా గురువారం ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ చార్జీ సరిత తిరుపతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ పండగను ముస్లిం, మైనారిటీ మిత్రులందరు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.