గురుకులాల్లో చదివే పిల్లలు ఎవరైనా మన పిల్లలే, వాళ్ల భవిష్యత్తు మెరుగు పరచడానికి సమయం ఆసన్నమైందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో గురుకులాల విద్యపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. మహత్తరమైన పనులు హఠాత్తుగా జరగవు కానీ చిన్న చిన్న పనులు సమాహారం తోటి సాధించబడతాయన్నారు.