రోడ్డుపై పాలుపోసి పాడి రైతుల నిరసన

82చూసినవారు
రోడ్డుపై పాలుపోసి పాడి రైతుల నిరసన
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం పాడి రైతులు పాల బిల్లులు రావడం లేదని ఆందోళన చేపట్టారు. రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో పశుపోషణ ఇబ్బందికరంగా మారిందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు రైతుల ఖాతాలో జమ చేయాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్