మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా రోడ్ పై ఓవర్ లోడ్ కంకర ట్రిప్పర్ లు అధికారుల అండదండలతో నడుస్తున్నాయి. ఈ విషయంపై గతంలో పలుమార్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి స్వయానా ఓవర్ లోడ్ తో బండ్లు నడవకూడదని పోలీసులకు సూచించారు. రోడ్డుపై వెళ్లి ఇతర వాహనదారులు కళ్ళలో దుమ్ము, ధూళి పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా శాఖ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.