జడ్చర్ల: భారీ వాహనం.. వాహనదారుల అవస్థలు

65చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో అండర్ రైల్వే బ్రిడ్జి పనులు కోనసాగుతున్నాయి. దీంతో వాహనాలు సర్వీస్ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నాయి. శుక్రవారం ఓ భారీ వాహనం పెద్ద యంత్రాన్ని తీసుకెళ్తుండడంతో ఆ మార్గంపై నిదానంగా ప్రయాణించింది. దీంతో వెనక వైపు ఉన్న వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంలో ద్విచక్ర వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్