కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్

73చూసినవారు
కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు కావేరమ్మ పేటలోని కంటి వెలుగు కేంద్రాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ సందర్శించారు. అనంతరం చైర్ పర్సన్ డాక్టర్లతో మాట్లాడుతూ, కంటి సమస్యలతో వస్తున్న ప్రతి ఒక్కరిని పరీక్షలు చేసి వారికి తగు సూచనలు మరియు ఎక్కువ కంటి చూపుతో బాధపడుతున్న వారికి అద్దాలు ఇవ్వాలని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బుక్క మహేష్, కుమ్మరి రాజు, మున్సిపల్ ఆర్ వో శశిధర్, మూడా డైరెక్టర్ వైజీ. ప్రీతమ్, డాక్టర్ శివకాంత్, ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్