గోపాల్ దిన్నె జలాశయాన్ని సంద‌ర్శించిన మంత్రి జూపల్లి

50చూసినవారు
గోపాల్ దిన్నె జలాశయాన్ని సంద‌ర్శించిన మంత్రి జూపల్లి
కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం వీప‌న‌గండ్ల మండ‌లం గోపాల్ దిన్నె జలాశయాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణా రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ డబ్ల్యూఎస్ అధికారుల‌ను జ‌లాశయ నీటి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న నీటి వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతి నిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్