మహబూబ్ నగర్: భారత మహిళా జట్టుకు నెట్ బాల్ కోచ్ గా నియమితులైన పుల్పవానిపల్లి వాసి బోడ విక్రమాదిత్య రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు అయిన ఆయన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కోరమండల్ స్టేడియంలో గురువారం నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ఏషియన్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ లో భారత ఉమెన్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నారు.