ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు యువకులు మృతి

7382చూసినవారు
ప్రాణం తీసిన ఈత సరదా.. ఇద్దరు యువకులు మృతి
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన దేవరకద్రలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగన్న వివరాలు.. మహబూబ్ నగర్ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వాకిటి శివకుమార్(22), హరిజన్ గణేష్(20) ఇద్దరు స్నేహితులు బుధవారం కన్నయ్య బావిలో ఈతకు వెళ్లారు. శివకుమార్ బావిలోకి దిగి ఈత కొడుతుండగా గణేష్ కూడా మెల్లగా బావిలోకి దిగాడు. గణేష్ కు ఈత రాక మునిగిపోతుండగా శివకుమార్ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ మునిగి చనిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్