అమరచింత మండల కేంద్రంలో గ్రంథాలయాల ఏర్పాటు చేయాలని ఏఐవైఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగులకు, యువకులకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రంథాలయం లేక ఇబ్బందులు పడుతున్నారని, పోటీ పరీక్షలకు సరైన పుస్తకాలు అందుబాటులో అవస్థలు పడుతున్నారని, అధికారులు గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు