ఆత్మకూరు: వసతి గృహాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

63చూసినవారు
ఆత్మకూరు పట్టణంలోని బాలుర బాలికల వసతి గృహాలను శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తనిఖీ చేశారు. అనంతరం నూతన కామన్ డైట్ మెనూ ను ప్రారంభించారు. గత పదేళ్లుగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు సరైన ఆహారం అందించ లేక పోయామని అన్నారు. ఈ విషయాన్ని గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 శాతం చార్జీలను పెంచినట్లు చెప్పారు. ఇకనుండి విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందిస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్