మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామ శివారుల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వ భూములను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తుందని, అందరికీ అనుకూలంగా వున్న భూములను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.