మక్తల్ పట్టణంలోని నల్ల జానమ్మ ఆలయ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో మండల పరిధిలోని పంచదేవ్ పాడ్ గ్రామానికి చెందిన తాయప్ప మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు ఆసుపత్రికి తరలించారు.