మాగనూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కలుషిత ఆహారం ఘటనలో బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్ర ఉన్నట్లు తనకు అనుమానం వుందని ఎమ్మెల్యే శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మక్తల్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుసగా జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో జరిపిన విచారణలో తనకు ప్రాథమిక సమాచారం లభించిందని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు పిల్లలపై ప్రయోగాలు చేయడం సరైంది కాదన్నారు.