సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగే మాలల సింహగర్జనకు ఉట్కూరు మండలం నుండి మాలలు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాల సంఘం మండల కన్వీనర్ హన్మేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వo మొదలు పెట్టిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఎస్సీ సంక్షేమ ఫలాలు, దళిత బంధు లబ్ధిదారుల జాబితాను కులాల వారిగా విడుదల చేయాలని అన్నారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.