పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎంపీ డికే అరుణ పాలమూరుకు నవోదయ పాఠశాలను మంజూరు చేయించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ఆదివారం ఉట్కూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవోదయ పాఠశాల మంజూరు చేయించిన ఎంపీ అరుణకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం బీజేపీకి మాత్రమే సాధ్యమని అన్నారు.