
ఉట్కూర్: ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ఎస్సై కృష్ణంరాజు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ వాడాలని అన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.