రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కల్వకుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పండిత్ రావ్ అన్నారు. ఆదివారం మార్కెట్ యార్డులో పర్యటించి రైతులు తెచ్చిన వేరుశనగ కొనుగోలును సందర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని వ్యాపారులకు సూచించారు. మార్కెట్కు వచ్చే రైతులకు మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.