కొల్లాపూర్ మండలం బోరబండ తండా, చింతలపల్లి, జవాయిపల్లి, మాచినేనిపల్లి, ముక్కిడిగుండం, గ్రామాల్లో గ్రామ పంచాయితీలో గ్రామ సభలో మంగళవారం అదనపు కలెక్టర్ దేవ సహాయం పాల్గొన్నారు. నాలుగు సంక్షేమ పథకాలు అమలుకై మంగళవారం గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాబితాలో పేర్లు రానివారు ఆందోళన పడుద్దని అర్హత కలిగిన వాళ్లు గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.