నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది మహమ్మద్ హమీద్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ అయ్యాయి. హమీద్ అలీ, బల్మూరు మండలం గోదల్ గ్రామానికి చెందిన అహ్మద్ అలీ కుటుంబం నుంచి వచ్చారు. 1987 నుండి 37 ఏళ్ల పాటు నాగర్ కర్నూల్ కోర్టులో క్రిమినల్ లాయర్‌గా సేవలందిస్తున్నారు.