నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ జిల్లా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సరం పూర్తయిన సందర్బంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం జరిగింది. ఆరు గ్యారంటీలు 66 హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లోకి తీసుకెళ్లి వారి విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.