ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు చొరవచూపి దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజావాణి'లో బాధితుల నుంచి 53 దరఖాస్తులు తీసుకొని దరఖాస్తుదారుల సమస్యలపై కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి శాఖలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.