నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవనాన్ని వైద్య విద్యార్థుల తరగతుల నిర్వహణకు అన్ని సదుపాయాలతో సంసిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. 25 ఎకరాల్లో నూతనంగా నిర్మితమౌతున్న మెడికల్ కళాశాల తరగతి గదుల భవనాలను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. నూతన మెడికల్ కళాశాలలో చివరి దశలో ఉన్న పనులను వేగవంతం పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.