నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గడంతో సంగమేశ్వర ఆలయ శిఖరం బయటికి కనపడడం జరిగింది. ఆదివారం కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం చివరి రోజు సంగమేశ్వర ఆలయం శిఖర దర్శన కలగడంతో ఆలయ పురోహితుడు తెల్కపల్లి రఘురామశర్మ పూజలు నిర్వహించారు.