బిజినపల్లి: నూనె గింజల పంటలపై శిక్షణ
జాతీయ ఆహార పథకం భద్రత కింద సోమవారం బిజినపల్లి మండలం పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు నూనె గింజల వంటల సాగు, యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేవీకే సమన్వయకర్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ఎఫ్ఎస్ఎం పథకం కింద నూనెగింజల పంటల సాగును ప్రోత్సహిస్తున్నారని వేరుశనగ పంట సామూహిక ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి పంట మొక్క ఉత్పాదకాల వినియోగం, యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.