కోటకొండలోని మల్లెల చెరువు అలుగు పునర్నిర్మాణం చేయాలి

55చూసినవారు
కోటకొండలోని మల్లెల చెరువు అలుగు పునర్నిర్మాణం  చేయాలి
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోని మల్లెల వాని చెరువు గత నెలలో కురిసిన భారీ వర్షాలతో అలుగు పారడంతో పాక్షికంగా దెబ్బ తిన్నందుకు, రైతులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు జెసిపి ద్వారా అలుగు గోడను తీశారు. ఇప్పుడు వర్షాలు ఆగిపోయిన నేపథ్యంలో, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ మండల కార్యదర్శి నరసింహ నేతృత్వంలో రైతులు కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను కలసి మల్లెల చెరువు పునర్నిర్మాణాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్