ఘనంగా పూలే జయంతి వేడుకలు

75చూసినవారు
ఘనంగా పూలే జయంతి వేడుకలు
నారాయణపేట జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాఖ జిల్లా అధికారి కృష్ణమాచారి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సమసమాజ స్థాపనకు, అంటరానితనం నిర్మూలనకు పూలే ఎనలేని కృషి చేశారని అన్నారు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి చేసిన కృషిని, సేవలను కొనియాడారు. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్