హిందూ ధర్మ పరిరక్షణకు హిందువులు అందరూ కంకణబద్ధులు కావాలని డాక్టర్ మధన్ మోహన్ రెడ్డి, రాంబాబు అన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని సరాఫ్ బజార్ లో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మం, చరిత్ర, సంస్కృతి గురించి ప్రజలకు వివరించారు. హిందువులు ఏకతాటిపై వుండి సనాతన ధర్మం కాపాడుకోవాలని చెప్పారు.