దామరగిద్ద మండలంలో కుర్తి గ్రామానికి చెందిన సంతోష అనే గర్భిణి మహిళకు గురువారం పురిటినొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది గర్భిణీ మహిళను నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికం కావడంతో మగ కవల పిల్లలకు జన్మనిచ్చిందని టెక్నీషియన్ వెంకటేష్ తెలిపారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని చెప్పారు.