నారాయణపేట: పోలీసులకు వ్యాసరచన పోటీలు

68చూసినవారు
నారాయణపేట: పోలీసులకు వ్యాసరచన పోటీలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నారాయణపేట ఎస్పీ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ సిబ్బందికి అధికారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు అదనపు ఎస్పీ ఎండి రియాజ్ తెలిపారు. సమాజంలో పోలీస్ ప్రతిష్టను మెరుగుపరచడంలో పోలీసుల పాత్ర, దృఢమైన శరీరం దృఢమైన మనసు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్