దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

85చూసినవారు
దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల కేంద్రం శివారులోని హజ్రత్ భద్రదీన్ సాహెబ్ దర్గాలో ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గందోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దర్గా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే మేఘా రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్