దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి అదనపు కలెక్టర్

84చూసినవారు
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మహిళా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. దివ్యాంగులు వికలత్వాన్ని జయించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్