అమరచింత మండల తహశీల్దార్గా విధులు నిర్వహిస్తున్న బి. రమేష్ రెడ్డి బుధవారం వనపర్తి జిల్లా కేంద్రానికి బదిలీపై వెళ్లారు. అమరచింత తహశీల్దార్గా విధులు చేపట్టిన 56 రోజులకే ఆయన బదిలీపై వెళ్లారు. అమరచింతలో విధులు నిర్వహించిన తనకు వివిధ రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలు సహకరించారని రమేష్ రెడ్డి అన్నారు.