ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం అప్పారెడ్డిపల్లిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లబ్ధిదారులంతా ఎంతో సంతోషంతో తమకు సొంతింటి కల నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేస్తూ రేవంత్ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పడం అభినందనీయం అన్నారు.