వనపర్తి జిల్లా కేంద్రంలో క్యాంప్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. బడుగు, బలహీనవర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలిబహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు