ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో వరదల్లో ఓ కుక్క చిక్కుకుపోయింది. అయితే అది గమనించిన ఓ వ్యక్తి చొరవ తీసుకుని కుక్కను సురక్షితంగా కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.