బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాకు చెందిన 13 సంవత్సరాల బాలికను వేధించిన కేసులో సుబ్బారావు పల్లికి చెందిన రాస వెంకటేషు సోమవారం అరెస్టు చేసినట్లు టూ టౌన్ ఎస్సై మహేందర్ తెలిపారు. వెంకటేష్ గత రెండు నెలలుగా పాఠశాలకు వెళ్తుండగా బాలికను వెంబడించి ప్రేమించమని వేధింపులకు పాల్పడుతున్నాడు. మూడు రోజుల కితం తన బైక్పై ఎక్కమని, చేయిపట్టుకుని బలవంతం చేయగా సదరు బాలిక వెంటనే తిరస్కరించింది.