సింగరేణి ఆసుపత్రిలో నిలిచిన ప్రసవాలు

51చూసినవారు
సింగరేణి ఆసుపత్రిలో నిలిచిన ప్రసవాలు
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఉనికిని దెబ్బతీసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైద్యులు ఉన్నప్పటికీ చికిత్సలు అందకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో 45 రోజుల నుంచి గర్భిణులకు ప్రసవాలు చేయడం లేదు. ఆసుపత్రిలో గైనకాలజిస్టు, మత్తు వైద్యులు ఉన్నా మత్తు ఇచ్చే యంత్రం(డ్రాగర్ మిషన్) పనిచేయడం లేదనే సాకుతో ప్రసవాల కోసం వస్తున్న గర్భిణులను రామకృష్ణాపూర్ ఆసుపత్రికి పంపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్