నెన్నెల: గొల్లపల్లిలో ఘనంగా జెండా పండుగ

63చూసినవారు
నెన్నెల: గొల్లపల్లిలో ఘనంగా జెండా పండుగ
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామదేవుని జెండా పండుగను శనివారం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ప్రతి దసరా పండగకు ఈ వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకోవడం ఆనవాయితీ అని మాజీ సర్పంచ్ ఇందురీ శశికళ తెలిపారు. ప్రజలంతా ఐక్యతతో మొక్కులు చెల్లించుకొని గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. పసిడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్