అకాల వర్షాలతో తడిసిన ధాన్యం పత్తి పంటలకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులతో సోమవారం మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏమాజీ మాట్లాడారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని పత్తిని పరిశీలించారు. ప్రభుత్వం సక్రమంగా ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని కల్లాల్లో నిలువ చేసుకొని నష్టపోయారన్నారు.