పెండింగ్ లో ఉన్న డీఎలను విడుదల చేయాలి

76చూసినవారు
పెండింగ్ లో ఉన్న డీఎలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో తాండూర్ లోని వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చక్రపాణి మాట్లాడుతూ బకాయిపడిన కరువు భత్యం వెంటనే మంజూరు చేయాలని, పిఆర్సి నివేదికను తెప్పించుకొని జాప్యం లేకుండా అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్