మందమర్రిలో ఎలక్ట్రిషన్ డే సంబరాలు

1048చూసినవారు
మందమర్రిలో ఎలక్ట్రిషన్ డే సంబరాలు
మందమర్రిలో ఎలక్ట్రిషన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ ప్రధాన కూడళ్ల గుండా పాత బస్టాండ్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మనం నిత్యం వినియోగించే విద్యుత్ బల్బును కనిపెట్టిన పితామహుడు థామస్ ఆల్వా ఎడిషన్ బల్బును ఆవిష్కరించిన రోజును ఎలక్ట్రిషన్ రోజుగా పరిగణించుకుంటూ ఎలక్ట్రిషన్ అందరూ ఒక పండగ లాగా ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ఎలక్ట్రిషన్ అందరూ ఐకమత్యంతో సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అజీజుర్ రెహమాన్, ప్రధాన కార్యదర్శి పిల్లి. మల్లేష్, కోశాధికారి మడ్డి. వేణుగోపాల్, ఉపాధ్యక్షులు కుమార్, శ్రీనివాస్, రబ్బాని, హైమద్, శేఖర్ సురేష్ వాసు, సందీప్ శివప్రసాద్, మున్నా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్