జైపూర్: పేకాట స్థావరంపై దాడి

72చూసినవారు
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల శివారు ఫామ్ హౌస్ లో శుక్రవారం రహస్యంగా పేకాట ఆడుతున్నారన్నా సమాచారం మేరకు రామగుండం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20, 040 , ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం జైపూర్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్