పురాతన కల్వర్టుల తో ప్రజల ఇక్కట్లు

3856చూసినవారు
పురాతన కల్వర్టుల తో ప్రజల ఇక్కట్లు
మందమర్రి రెండో జోన్ రైల్వే స్టేషన్ రోడ్డు యూపీఎస్సీ స్కూల్ ప్రక్కన మూల మలుపు వద్ద కల్వర్టులో గురువారం సిమెంట్ తోడుతో వెళ్తున్న లారీ దిగబడింది. దాంతో స్టేషన్ రోడ్డు వైపు వెళ్లే వారికి ఇబ్బంది ఏర్పడింది. కొంతసేపటికి జేసీబీ సాయంతో దిగబడిన లారీని బయటకు తీశారు. హెవీ లోడ్ ఉన్న సిమెంట్ లారీ వెళ్లడం వలన పురాతనమైన కల్వర్టు కావడంతో కొంత భాగము కూలిపోయింది. ఇష్టారీతిగా కాలనీల్లోకి హెవీ లోడుతో వాహనాలు వెళుతున్నాయని, పట్టణంలో చాలా చోట్ల కల్వర్టులు కూలిపోయి ఉన్నాయని హెవీ లోడ్తో వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్