మతోన్మాద రాజకీయాల నుండి రాజ్యాంగాన్ని కాపాడడమే అంబేద్కర్ కి ఇచ్చే నిజమైన నివాళి

562చూసినవారు
మతోన్మాద రాజకీయాల నుండి రాజ్యాంగాన్ని కాపాడడమే అంబేద్కర్ కి ఇచ్చే నిజమైన నివాళి
మందమర్రి లో అంబేద్కర్ 132వ జయంతిని పునస్కరించుకొని శుక్రవారం కేకే 2 నర్సరీ పని ప్రదేశంలో సిపిఎం ఆధ్వర్యంలో డా.బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్132వ జయంతి జరుపుకోవడం అంటే దేశంలో ఆర్ఎస్ఎస్, బిజెపి మతోన్మాద రాజకీయాల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కి దేశ ప్రజలు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం మందమర్రి మండల కార్యదర్శి దూలం శ్రీనివాస్ , కాసర్ల రాజలింగు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నిర్మల, ఉమాదేవి, కట్ల కళావతి, సరోజన, లక్ష్మి, రాజయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్