అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్
బియ్యాన్ని బుధవారం నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన మోసెస్ 45 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని బొలెరో వాహనంలో అక్రమంగా మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. సీసీసీ కార్నర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.