ఈ నెల 8న గోదావరిఖనిలో జరిగే ఐఎఫ్టీయూ ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు డి. బ్రహ్మానందం, మేకల రామన్న పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాలలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సదస్సుకు ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఎం. శ్రీనివాస్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.