ఆలయ ఫౌండేషన్, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని పౌండేషన్ సభ్యులు బుధవారం తెలిపారు. వెల్డింగ్, ఆటోమొబైల్, ఎక్స్కావేటర్ ఆపరేటర్ తదితర వాటిలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రెండు నెలల ట్రైనింగ్, ఒక నెల ఆన్ టైం జాబ్ ఉంటుందని తెలిపారు. ఈనెల 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.